మృణాల్ ఠాకూర్ కు సౌత్ లో వచ్చిన సక్సెస్ లు మాత్రం ఆమె మాతృ భాష హిందీలో దక్కడం లేదు. అక్కడ వరస సినిమాలు చేస్తుంది కానీ.. విజయమే అల్లంత దూరాన ఉంటుంది. సౌత్ లో ఆమెకి సీతారామం, హాయ్ నాన్న తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పలకరించినా ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ మాత్రం ఆమెను డిజప్పాయింట్ చేసింది.
ఇక ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్స్ తో పాటుగా సౌత్ లోను అడివి శేష్ తో డెకాయిట్ మూవీలో నటిస్తుంది. మరోపక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మృణాల్ కి ఓ ఆఫర్ వచ్చింది అని ప్రచారం జరిగినా అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఇప్పుడు మృణాల్ కు ఓ బంపర్ ఆఫర్ తగిలింది అంటున్నారు.
అజయ్ దేవగణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్ లో మృణాల్ ఠాకూర్ కి కీలకపాత్ర చేసే అవకాశం దక్కింది అని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో నటించిన సోనాక్షి సిన్హాను కాదని ఈసారి మృణాల్ ఠాకూర్ ని ఫైనల్ చేసినట్లుగా టాక్ వినబడుతుంది. మరి ఇది ఓకె అయితే మృణాల్ కేరీర్ మాములుగా ఉండదు.