రాజమౌళి-మహేష్ కాంబోలో జనవరి 2 న మొదలైన SSMB 29 చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అనేది క్లారిటీ లేదు. సంక్రాంతి తర్వాత రాజమౌళి-మహేష్ కలిసి సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ని హీరోయిన్ గా ఎంపిక చేశారనే వార్త వైరల్ అవుతూనే ఉంది.
ఎక్కడా ప్రియాంక పేరు అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ప్రియాంక చోప్రా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ప్రియాంక చాలా క్యాజువల్ లుక్‌లో, అంటే గ్రే కలర్ హూడీ, లాంగ్ వేర్ ధరించింది. ప్రియాంక ఎయిర్ పోర్ట్ నుండి బయట వస్తుండగా మీడియా ఆమెని ఫొటోస్, వీడియోస్ తీసేందుకు వెంటపడినా ప్రియాంక మాత్రం నవ్వుతూ వెళ్ళిపోయిన వీడియోస్ వైరల్ అయ్యాయి.
ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చింది మహేష్-రాజమౌళి కాంబో మూవీ కోసమే, త్వరలోనే ఆమె SSMB 29 షూటింగ్ లో అడుగుపెట్టబోతుంది అని మహేష్ అభిమానులు ఫిక్స్ అవుతున్నారు.