పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాల్సిన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఆ చిత్రం షూటింగ్ లేట్ అవుతూ రావడంతో ముందుగా బాలయ్య డాకు మహారాజ్ చిత్రంతో తెలుగులోకి విలన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసారు. డాకు మహారాజ్ హిట్ అవడంతో బాబీ డియోల్ పేరు బాగానే రిజిస్టర్ అయ్యింది తెలుగు ప్రేక్షకుల్లో.
తాజాగా డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో బాబీ డియోల్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. హరిహర వీరమల్లు స్క్రిప్ట్ అనేది చాలా యూనిక్ స్క్రిప్ట్. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయని, గతంలో జరిగిన కథలు మంచి ఎమోషనల్ గా మాస్ గా కూడా ఉంటాయని చెప్పడమే కాదు..
మొదటిసారి హరి హర వీరమల్లు కథ విన్నపుడే ఎంతో నచ్చింది, అలాంటి సినిమాలో భాగం అయ్యినందుకు ఆనందంగా ఉందని బాబీ డియోల్ వీరమల్లు పై అంచనాలు పెంచేశారు.