Advertisementt

మంచు ఫ్యామిలీ పరస్పర కేసులు

Fri 17th Jan 2025 12:21 PM
mohan babu  మంచు ఫ్యామిలీ పరస్పర కేసులు
Mohan Babu files a case against Manoj మంచు ఫ్యామిలీ పరస్పర కేసులు
Advertisement
Ads by CJ

గత ఏడాది మంచు ఫ్యామిలిలో జరిగిన గొడవలు ఎంతగా హైలెట్ అయ్యాయో.. ఈ ఏడాది ఆరంభంలోనూ మంచు ఫ్యామిలీ మధ్యన గొడవలు అంతే రసవత్తరంగా మారాయి. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్యన ఆస్తి తగాదాలు ఆకాశాన్నంటాయి. మంచు విష్ణు పై కూడా మనోజ్ కేసులు పెట్టడం అన్ని హైలెట్ అయ్యాయి. 

ఇక సంక్రాంతి సందర్భంగా మంచు మనోజ్ మరోమారు మంచు యూనివర్సిటీ దగ్గర రచ్చ చేసాడు. మోహన్ బాబు మనోజ్ అతని భార్యపై కేసు పెట్టడం, మోహన్ బాబు పై మనోజ్ కేసు అన్ని మళ్ళీ మళ్ళీ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. 

తాజాగా చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై  2 కేసులు నమోదు అయ్యాయి. డెయిరీ ఫాం గేటు వద్ద జరిగిన ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదులు చేసుకున్నారు. మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్‌ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్‌, మౌనికతో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేసారు పోలీసులు. తనపై, తన భార్య మౌనికపై దాడికి ప్రయత్నించారంటూ మనోజ్‌ ఫిర్యాదు చెయ్యడంతో.. మోహన్‌బాబు పీఏతో పాటు ఎంబీయూ సిబ్బంది 8 మందిపై కేసులు నమోదు అయ్యాయి.

Mohan Babu files a case against Manoj:

Manchu Manoj files a case against Mohan Babu

Tags:   MOHAN BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ