Advertisementt

100 కోట్ల క్లబ్బులోకి వెంకిమామ

Fri 17th Jan 2025 10:47 AM
sankranthiki vasthunnam  100 కోట్ల క్లబ్బులోకి వెంకిమామ
Sankranthiki Vasthunnam Crosses 100 Crores 100 కోట్ల క్లబ్బులోకి వెంకిమామ
Advertisement
Ads by CJ

అనిల్ రావిపూడి కొట్టాడు హిట్టు, వెంకిమామను అఫీషియల్ గా 100 కోట్ల క్లబ్బులో చేర్చాడు. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి రికార్డ్ క్రియేట్ చేసాడు. ఇండస్ట్రీ హిట్లు కానక్కర్లేదు, అలాగని బ్లాక్ బస్టర్స్ అవ్వక్కర్లేదు, నిర్మాతలను ఒడ్డున పడేసే సాధారణ హిట్లు వచ్చినా చాలు అదే అనిల్ రావిపూడి నంచి వస్తున్న ఫార్ములా. 

రైటర్ గా గౌరవం దక్కలేదు అనే కారణంగా దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్న అనిల్ కి విజయం పూలబాట వేసింది. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేష్ తో కలిసి ఈ సంక్రాంతి కి వచ్చి మంచి హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. మంగళవారం జనవరి 14 న విడుదలైన ఈచిత్రం ఫ్యామిలీ హిట్ గా నిలిచింది.

సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి హిట్ గా నిలవడమే కాదు మూడు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ సాధించి అధికారికంగా వెంకిమామ 100కోట్ల క్లబ్బులోకి అలవోకగా ఎంటర్ అయ్యాడు. మూడు రోజుల్లో వెంకటేష్ 100 కోట్లు కొట్టడమంటే మాటలు కాదు. అనిల్ రావిపూడి కామెడీ మరోసారి వర్కౌట్ అవ్వడం, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవడం, సంక్రాంతి పండుగ కలిసి రావడంతో సంక్రాంతికి వస్తున్నాం మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులోకి చేరింది. 

Sankranthiki Vasthunnam Crosses 100 Crores:

Sankranthiki Vasthunnam Box Office Collection

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ