నందమూరి అభిమానులు ప్రస్తుతం బాలయ్యను తెగ పొగిడేస్తున్నారు, కాదు కాదు నెటిజెన్స్ బాలయ్య నువ్ కేకయ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు. వరసగా నాలుగు హిట్లు, ఈ మధ్య కాలంలో ఏ సీనియర్ హీరోకీ సాధ్యం కాని రేర్ ఫీట్ బాలయ్య సాధించారు. అఖండ నుంచి అన్ స్టాపబుల్ గా హిట్లు కొడుతున్నారు.
నిన్నగాక మొన్నొచ్చిన డాకు మహారాజ్ తో నాలుగో హిట్టు కొట్టడమే కాదు.. వరసగా నాలుగోసారి 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టి అద్దరగొట్టేసారు. బోయపాటి.. అఖండతో బాలయ్య ను ట్రాక్ లోకి ఎక్కించడమే కాదు, ఆయన రెండో కుమార్తె తేజస్విని బాలయ్య లుక్స్ విషయంలో శ్రద్ధ తీసుకోవడంతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఆయన సక్సెస్ క్రెడిట్ అంతా తేజస్వినిదే అంటూ నందమూరి అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
అఖండ, వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా అన్ని బాలయ్య ఖతాలో భారీ హిట్లుగా నిలవడం నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. వరస సక్సెస్ లతో జోష్ మీదున్న బాలయ్య బోయపాటి తో అఖండ 2 తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమనే మాట అందరి నోటా వినిపిస్తోంది.