Advertisementt

భైర‌పై దాడి.. షాక్‌లో దేవర!

Thu 16th Jan 2025 10:37 AM
ntr  భైర‌పై దాడి.. షాక్‌లో దేవర!
Attack on Saif Ali Khan - Shocked Tarak భైర‌పై దాడి.. షాక్‌లో దేవర!
Advertisement
Ads by CJ

ఈ రోజు గురువారం తెల్లవారు జామున బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ దొంగ చేసిన దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు ఆరు కత్తిపోట్లు దిగడం కలకలం సృష్టించింది. తెల్లవారు జామున ఓ దొంగ సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దొంగ తనకు అడ్డొచ్చిన సైఫ్ పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. 

గాయపడిన సైఫ్ ని వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా షాకవడమే కాకుండా సోషల్ మీడియాలో సైఫ్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేసారు. 

దేవర చిత్రంలో ఎన్టీఆర్‌కి విలన్‌గా భైర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురైన విషయం తెలిసి బాలీవుడ్ స్టార్స్ లీలావతి ఆసుపత్రికి వెళ్లి ఆయన పరిస్థితిని తెలుసుకుంటూ సైఫ్ కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు. 

ఈ దాడిపై పోలీసులు విచారణ చేపట్టారని.. మీడియా, అభిమానులు ఓపిక పట్టాలని కోరుతున్నట్లుగా పటౌడి ఫ్యామిలీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

Attack on Saif Ali Khan - Shocked Tarak:

Jr NTR expresses shock on Saif Ali Khan attack

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ