మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ విషయంలో శంకర్ ని, దిల్ రాజు ని చాలా తిట్టుకున్నారు. ప్రోపర్ ప్రమోషన్స్ లేవు, అసలు అప్ డేట్ లు లేవు, అలా గేమ్ చేంజర్ ని చప్పగా ప్రేక్షకుల ముందుకు తెచ్చెయ్యడం మాత్రం వారికి నచ్చలేదు. ఎలాంటి బజ్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటి కనిపించింది. గేమ్ చేంజర్ హిందీ వెర్షన్ లీక్ చెయ్యడం దగ్గరనుంచి సోషల్ మీడియాలో సినిమాపై నెగెటివ్ ట్వీట్స్ అన్ని గేమ్ చేంజర్ కలెక్షన్స్ తగ్గడానికి కారణమైంది.
తాజాగా మెగా ఫ్యాన్ ఒకరు గేమ్ చేంజర్ ని కిల్ చెయ్యడానికి ఎన్నో ప్లాన్స్ చేసినా రామ్ చరణ్ పెరఫార్మెన్స్ ని ఎవరూ పేరు పెట్టలేకపోయారంటూ వేసిన ట్వీట్ చూసిన నెటిజెన్స్ మెగా ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ చూసారా అంటూ కామెంట్ చేస్తున్నారు.
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నెగెటివ్ చెయ్యడానికి, పైరసీ ప్రింట్స్ స్ప్రెడ్ చేశారు, పైసలు ఇచ్చి బ్యాడ్ రివ్యూస్ ఇప్పించారు. కాని entire episode లో ఒక్కడు అంటే ఒక్కడు చరణ్ నటన గురించి నెగెటివ్ గా చెప్పలేక పోయారు. ప్రతొక్కడు శంకర్ మాజిక్ లేదు, శంకర్ మార్క్ లేదు అనడం తప్ప స్టోరీ బాగోలేదు లేదా చరణ్ నటన బాగోలేదు, లేదా కాన్సెప్ట్ బాగోలేదు అని ఏ ఒక్కడు అనలేకపోయారు. ప్రతొక్క సన్నాసి ఒకటే డైలాగ్ అదేదో జగన్ రెడ్డి పేటియం సన్నాసులకి ఇచ్చిన స్క్రిప్ట్ లా Sankar Magic missing so movie is disaster.
ఇండష్ట్రీ కూడా జైలుకి పోయి వస్తే కాదు సపోర్ట్ చెయ్యాల్సింది. ఇలా సినిమా ని కిల్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వల్సింది. ఈ కల్చర్ కంటిన్యూ అయితే ఈరోజు గేమ్ చేంజర్ రేపు మీ సినిమా ఆయ్యే చాన్స్ ఉంది.