సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ వారసులను పరిచయం చేసేందుకు ఎంతో అలోచించి ఓ దర్శకుడికి అప్పజెబుతారు. అయినా వెనుకుండి అన్ని తామై నడిపిస్తారు. గతంలో పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, అఖిల్ ఇలా.. కృష్ణం రాజు దగ్గర నుంచి నాగార్జున వరకు వారసుల అరంగేట్రాన్ని ఏంతో జాగ్రత్తలు తీసుకుని మరీ చేసారు. వారసులైనా ఇష్టానికి ప్రేక్షకులు స్వీకరించరు. అందుకే వారి డెబ్యూ సినిమాలన్నీ నామ మాత్రంగానే మిగిలిపోయాయి. స్టామినా ప్రూవ్ చేసుకున్నాకే వారసులను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
అయితే నందమూరి వారసుడు మోక్షజ్ఞ విషయంలో మాత్రం కాస్త డిఫ్రెంట్ గా జరుగుతుంది. చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ ఇలా ఎవరూ అంత తేలిగ్గా ఎంట్రీ ఇవ్వకపోయినా మోక్షజ్ఞ అరంగేట్రం అంత అయితే కష్టపడలేదు అని చెప్పాలి. కానీ మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు వెనుక చాలా కథ నడుస్తుంది.
ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రకటన వచ్చింది. కానీ అది పట్టాలెక్కేందుకు ఇంకా సమయం రాలేదు. బాలయ్య పరిచయం చేసేందుకు ఆచితూచి అడుగులు వేసి ప్రశాంత్ వర్మని దర్శకుడిగా పట్టుకొచ్చినా కొడుకు డెబ్యూ మూవీని ఏ టెన్షన్ లేకుండా మొదలుపెట్టలేకపోతున్నారు.
ప్రశాంత్ వర్మ విషయంలో ఏ తెలియని అసంతృప్తి మాటలు వినిపించడం, మధ్యలో మోక్షు డెబ్యూ మూవీపై నీలి నీడలు ఇవన్నీ చూస్తుంటే ఏ వారసుడికి ఇలా జరగలేదేమో కేవలం మోక్షుకే ఇలా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.