సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి చిత్రాల తర్వాత తెలుగమ్మాయి అంజలి ఇక్కడ టాలీవుడ్ లో బిజీ అవుతుంది అనుకుని ఆమె తో పాటుగా ఆమె ఫ్యాన్స్ కూడా చాలా ఊహించేసుకున్నారు కానీ ఆ తర్వాత అడపా దడపా నిరాశపరిచే సినిమాల్లో కనిపించిన అంజలి అటు కోలీవుడ్ లోను పెద్దగా బిజీ కాలేకపోయింది.
స్టయిల్ మార్చింది, గ్లామర్ అవతారమెత్తింది. అందాలు ఆరబోసినా, గ్లామర్ చూపించినా అంజలిని ఎవరూ కన్సిడర్ చెయ్యలేదు. కోలీవుడ్ దర్శకుడు శంకర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం అంజలి ని చరణ్ ఫాదర్ పాత్రకి జోడిగా ఎంపిక చేసారు. కానీ ఆ చిత్రం రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ ఈ నెల 10 న విడుదలైంది.
ఈ చిత్రంలో అంజలి డీ గ్లామర్ పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. మరో హీరోయిన్ కియారా అద్వానీ చీర్ గర్ల్ లా సాంగ్స్ లో అందాలు ఆరబోస్తూ కనువిందు చేస్తే అంజలి మాత్రం అణుకువైన పాత్రలో గేమ్ ఛేంజింగ్ హీరోయిన్ గా ఆకట్టుకుంది. మరి ఈచిత్రంతో నైనా అంజలి టైమ్ స్టార్ట్ అవుతుందేమో చూడాలి.