నటి ప్రగ్య జైస్వాల్ కి సరైన అవకాశాలు దక్కడం లేదు. ఆమెని టాలీవుడ్ దర్శకనిర్మాతలెవరూ కన్సిడర్ చెయ్యడం లేదు. అయిప్పటికి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండీ ఫోటో షూట్స్ తో అద్భుతం అనేలాంటి పిక్స్ వదులుతూ ఉంటుంది. అయినప్పటికీ ఆమెకి అవకాశం ఇచ్చే నాధుడే లేదు.
కాని ఆమెని ప్రతిసారి బాలయ్యే ఆదుకుంటున్నారు. అఖండలో చక్కటి కేరెక్టర్ ఇచ్చిన బాలయ్య ఆతర్వాత మరోమారు ఆమెని డాకు మహారాజ్ లోకి తీసుకున్నారు. డాకు లో ఉర్వశిని హీరోయిన్ అని అందరూ అనుకున్నారు. కానీ అసలు హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ అని డాకు మహారాజ్ విడుదల ముందు వరకు క్లారిటీ లేదు.
సినిమాలో ప్రగ్య జైస్వాల్ ఆకట్టుకునే పాత్రలో కనిపించింది. ఆతర్వాత ఆమెకి ఏ హీరో ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మళ్ళి బాలయ్య అఖండ తాండవం లోనే కనిపించబోతుంది. అఖండ కు సీక్వెల్ గా మొదలైన అఖండ తాండవం లో బాలయ్య కు హీరోయిన్ మరోమారు ప్రగ్యా జైశ్వాల్ సందడి చేయనుంది. ఈ లెక్కన ప్రగ్య జైస్వాల్ ని బాలయ్య ఆదుకున్నట్లేగా.