బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ కి సౌత్ భాష అందులోను తెలుగు కలిసి రావడం లేదా? అదే నిజమేమో అనిపిస్తుంది. గతంలో మహేష్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మహేష్ తో భరత్ అనే నేను చిత్రంలో కలిసి నటించింది. అది యావరేజ్. ఆ తర్వాత వినయ విధేయ రామలో చరణ్-కియారా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అది ప్లాప్.
అప్పటినుంచి సౌత్ కి భారీ గ్యాప్ ఇచ్చిన కియారా అద్వానీ మళ్లీ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అంటూ శంకర్ దర్శంలో నటించింది. శంకర్ హీరోయిన్స్ ని ఎంతందంగా చూపిస్తారో అందరికి తెలుసు. అలానే కియారా ని శంకర్ గేమ్ చేంజర్ సాంగ్స్ లో చాలా అందంగా చూపించారు. ఆమె కూడా అందాల ఆరబోతతో ఛిల్ చేసింది.
అయితే రామ్ చరణ్ తో కియారా అద్వానీ కెమిస్ట్రీ కన్నా, విలన్ సూర్య-రామ్ చరణ్ కెమిస్ట్రీ బావుంది, హీరో-హీరోయిన్ ట్రాక్ నచ్చలేదంటూ మొహం మీదే మాట్లాడుతున్నారు ప్రేక్షకులు. కియారా చీర్ గర్ల్ కింద ఆనింది అంటూ ఆమె పాత్రని తేల్చేస్తున్నారు సినీ ప్రియులు. గేమ్ చెంజర్ కి ఎక్స్ట్రార్డినరీ టాక్ వస్తే కియారా అద్వానీ పేరు మరోలా మార్మోగిపోయేది. కానీ అలా జరగలేదు.