నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబోలో సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి ఎలాంటి టాక్ వచ్చినా అభిమానుల నుంచి మాత్రం ఎక్స్ట్రార్డినరీ టాక్ అయితే వచ్చింది. డాకు మహారాజ్ చూసిన నందమూరి అభిమానులు సంక్రాంతి పండగ ముందే వచ్చింది అంటూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇక తారక్ అభిమాని ఒకరు.. బాలయ్య డాకు మహారాజ్ చూసి బాలయ్య బాబు సెకండ్ ఇన్నింగ్స్ కాదు-మెరుపు ఇన్నింగ్స్.. అన్ని ఫోర్ లే, సిక్స్ లె.. ... వరసగా దంచు కొట్టుడే అంటూ ఆయన అఖండ నుంచి మొదలు పెట్టి వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరిలతో కొట్టిన హిట్స్ కి కంటిన్యూగా డాకు మహారాజ్ తో బ్రహ్మాండమైన హిట్ కొట్టారంటూ ట్వీట్ చేసాడు.
నిజమే అఖండ నుంచి ఇప్పటివరకు అన్ స్టాపబుల్ గా బాలయ్య ఏక ధాటిగా హిట్స్ కొడుతూనే ఉన్నారు. ఇపుడు డాకు మహారాజ్ కి యావరేజ్ టాక్ వచ్చినా అభిమానులకు మాత్రం డాకు బాగా నచ్చెయ్యడంతో సంక్రాంతి విన్నర్ అంటూ వాళ్ళు గొప్పగా మట్లాడడమే కాదు, బాలయ్య ఎనర్జీని తెగ పొగిడేస్తున్నారు.