Advertisementt

గేమ్ చేంజర్ మూడ్ నుంచి బయటికొచ్చేసారు

Sun 12th Jan 2025 08:38 PM
dil raju  గేమ్ చేంజర్ మూడ్ నుంచి బయటికొచ్చేసారు
The Game Changer came out of the mood గేమ్ చేంజర్ మూడ్ నుంచి బయటికొచ్చేసారు
Advertisement
Ads by CJ

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సంక్రాంతి కి గేమ్ చేంజర్ తో పాటుగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు నుంచి గేమ్ చేంజర్ వచ్చేసింది. ఆ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం నెగిటివిటి చాలా కనిపించింది. గేమ్ చేంజర్ ఖాళీ థియేటర్స్ అంటూ అందరూ హేళన చెయ్యడం అన్ని గేమ్ చేంజర్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడేలా చేసింది. 

మొదటి రోజు మేకర్స్ వేసిన కలెక్షన్స్ పోస్టర్ చూసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. అలాంటి సమయంలో నిర్మాత దిల్ రాజు ఫేస్ చూస్తే ఎలా ఉంటుంది. గేమ్ చేంజర్ ఫీడ్ బ్యాక్ చూసాక ఆయన ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తారు. అసలే ప్రమోషన్స్ విషయంలో ఓ పక్క విమర్శలు. 

అయితే గేమ్ చేంజర్ మూడ్ నుంచి దిల్ రాజు త్వరగానే బయటికొచ్చేసారు. ఆయన నుంచి రాబోతున్న మరో మూవీ సంక్రాంతికి వస్తున్నాం చిత్ర ప్రమోషన్స్ లో ఆయన నవ్వుతూ కనిపించారు. దిల్ రాజు అలా సరదాగా నవ్వడం చూసిన వారు గేమ్ చేంజర్ మూడ్ నుంచి త్వరగానే బయటికొచ్చేసారు అంటూ కామెంట్ చేస్తున్నారు. 

The Game Changer came out of the mood:

Dil Raju smile at the Sankranthiki Vasthunnam event

Tags:   DIL RAJU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ