ఆర్.ఆర్.ఆర్ తర్వాత మెగాస్టార్-రామ్ చరణ్ లు కలిసి ఆచార్య మూవీతో మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత అందరూ దానికి వదిలేసి గేమ్ చేంజర్ పై హోప్స్ పెట్టుకున్నారు. గేమ్ చేంజర్ అప్ డేట్స్ మెగా ఫ్యాన్స్ సహనానికి పరీక్షపెట్టారు. విడుదల తేదీని మార్చి మార్చి చివరికి సంక్రాంతికి విడుదల అన్నారు.
అటు చూస్తే దిల్ రాజు గేమ్ చేంజర్ ప్రమోషన్స్ పట్టించుకోలేదు. దిల్ రాజు కూడా హమ్మ గేమ్ చేంజర్ విడుదలైతే చాలు అన్నట్టుగా ఉంది గేమ్ చేంజర్ విడుదల పరిస్థితి. పాన్ ఇండియా మూవీ అంటే ఎలా ఉండాలి, ఓ రేంజ్ ప్రమోషన్ ఉండాలి. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ అంత కాకపోయినా పుష్ప 2 లెవల్ ప్రమోషన్స్ ఎక్స్ పెక్ట్ చేసారు అభిమానులు. అదీ లేదు.
రామ్ చరణ్ ను పెట్టుకుని శంకర్ అవుట్ డేటెడ్ మూవీ ఇవ్వడం మెగా అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. గేమ్ చెంజర్ కి వచ్చిన టాక్ వాళ్ళను బాగా డిజప్పాయింట్ చేసింది. రామ్ చరణ్ స్టామినా కూడా గేమ్ చెంజర్ ని కాపాడలేదు అని వాళ్ళు కూడా డిసైడ్ అవుతున్నారు.