సంక్రాంతి పండగవేళ దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఎఫ్ ఐఆర్ నమోదు చేయమంటూ కోర్టు పోలీసులను ఆదేశించడం హాట్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్ ఫిలిం నగర్ లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లిలోని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఫిల్మ్ నగర్ లోని దక్కన్ కిచెన్ హోటల్ అక్రమంగా కూల్చి వేసిన ఆరోపణలపై హీరో వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్ పై శనివారం ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452,458,120 బి సెక్షన్లపై కేసు నమోదు చేసి ఎఫ్ ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు.
వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్ లు తనకు చేసిన అన్యాయంపై నందకుమార్ కోర్టులో కొన్నేళ్లకుగా పోరాడుతున్నారు.