Advertisementt

పాన్ ఇండియాలో పవర్ చూపని గేమ్ ఛేంజర్

Sun 12th Jan 2025 09:55 AM
game changer  పాన్ ఇండియాలో పవర్ చూపని గేమ్ ఛేంజర్
Powerless Game Changer in pan India పాన్ ఇండియాలో పవర్ చూపని గేమ్ ఛేంజర్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్ పాన్ ఇండియా మార్కెట్ లో వర్కౌట్ అయిందా అంటే.. కాలేదు అనే సమాధానం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లేకపోవడం ముఖ్య కారణమైతే మరొకటి శంకర్ పై ఎక్కడో ఏదో అనుమానం. ఆయన వరస చిత్రాలు నిరాశపరచడంతో గేమ్ చేంజర్ పై పాన్ ఇండియా ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించలేదు అనేమాట వినబడుతుంది. 

గేమ్ చెంజర్ కి పాన్ ఇండియా భాషల్లో అసలు ఓపెనింగ్స్ లేవు అనేలా బెంగుళూరు, కొచ్చి, ముంబై లాంటి సిటీస్ లో ఖాళీ థియేటర్స్ దర్శనమిచ్చాయి. గేమ్ చేంజర్ విడుదలకు ముందు మినిమం బజ్ లేకపోవడం ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడింది. రామ్ చరణ్-ఇంకా శంకర్ కలిసి సినిమాని బాగా ప్రమోట్ చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు. మరోపక్క గేమ్ చేంజర్ హిందీ వెర్షన్ HD ప్రింట్ లీకవడం పెద్ద దెబ్బ. 

అటు సినిమా లీకవడం ఇటు మేకర్స్ ఎలాంటి హంగామా చెయ్యకపోవడం, గేమ్ చేంజర్ విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి లేకపోవడం వలనే ఈ చిత్రం పాన్ ఇండియా మర్కెట్ లో పవర్ చూపించలేకపోయింది అంటున్నారు. 

Powerless Game Changer in pan India:

Game Changer pan india performence

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ