నిన్నగాక మొన్న విడుదలైన గేమ్ చేంజర్ థియేటర్స్ ఖాళీ అంటూ సోషల్ మీడియా లో కనిపించిన న్యూస్ లు ఇప్పుడు బాలయ్య డాకు మహారాజ్ సినిమాకి కూడా చూడాల్సి రావడం మాత్రం నిజంగా షాకిచ్చే విషయమే. థియేటర్స్ ఖాళీగా ఉండడానికి కారణం సంక్రాంతికి ఊరెళ్ళి పోయారా.. లేదంటే సినిమాలపై ప్రేమ తగ్గిందా..
ఏది ఏమైనా ఈరోజు విడుదలైన డాకు మహారాజ్ థియేటర్స్ చాలా వరకు ఖాళీగా కనిపించాయి. ఈరోజు షోస్ కి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. హ్యాట్రిక్ హిట్స్ తో ఉన్న బాలయ్య నుంచి సినిమా వస్తే ఆ సందడి ఎలా ఉండాలి, హైదరాబాద్ థియేటర్స్ లో అలాంటి సందడి ఎక్కడా కనిపించనే లేదు. ఇప్పుడు కావాలన్నా బుక్ మై షో లో టికెట్స్ దొరకడం మాములు విషయం కాదు.
థియేటర్స్ కి వెళ్లకుండా అందరూ పల్లె బాట పట్టి సంక్రాంతి ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారో లేదంటే సినిమాలపై మోజు తగ్గిందో తెలియదు కానీ.. హైదరాబాద్ లో డాకు థియేటర్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.