నందమూరి బాలకృష్ణ - బాబీ కలయికలో తెరకెక్కిన డాకు మహారాజ్ ఈరోజు జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా డాకు మహారాజ్ చిత్రం కోసం నందమూరి అభిమానులు వెయిటింగ్. ఆ క్షణం రానే వచ్చేసింది. ఏపీ, తెలంగాణాలలో మిడ్ నైట్ షోస్ క్యాన్సిల్ అయినా, బెన్ఫిట్ షోస్ లేకపోయినా ఓవర్సీస్ లో డాకు మహారాజ్ ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యాయి. మరి ఆడియన్స్ ఆగుతారా డాకు పబ్లిక్ టాక్ అంటూ సందడి మొదలు పెట్టేసారు.
డాకు మహారాజ్ ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, బాలయ్య యాక్షన్ తో శివ తాండవం ఆడేసారు, ఫ్లాష్ బ్యాక్, సెకండాఫ్ స్టార్ట్ అయ్యే వరకు సినిమా అదిరిపోయింది అంటూ కొంతమంది చెబుతుంటే.. మరికొందరు మాత్రం సెకండాఫ్ అంతగా ఎక్కలేదని చెబుతున్నారు.
బాలయ్య కోసం రాసుకున్న సీన్లు, బాబీ ఆయనకు ఇచ్చిన ఎలివేషన్లు అదిరిపోయాయని, బాలయ్య అంటే పూనకాలు తెచ్చేసుకునే తమన్ మళ్లీ తన డ్యూటీని పర్ఫెక్ట్ గా చేసేసాడు, BGM అదిరిపోయింది అంటూ మరికొందరు ఆడియన్స్ స్పందిస్తున్నారు. ఇంకొందరు బాలయ్యను స్టైలీష్‌గా, సటిల్డ్‌గా చూపించారు, ప్రతి సీన్ మాస్ ఆడియెన్స్‌కు పిచ్చెక్కేలా సీన్లను డిజైన్ చేసుకున్నాడు బాబి.
కానీ కథనంలో మాత్రం ఎక్కడా కొత్తదనం లేదు, నెక్ట్స్ ఏం జరుగుతుందో ఆడియెన్స్‌కు ఇట్టే అర్థం అవుతుందట. చివరి 30 నిమిషాలు అయితే మరీ బోరింగ్ అంటుంటే... బాలయ్య ఫ్యాన్స్ మాత్రం బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్, బాబీ డైరెక్షన్, ఎలివేషన్స్ అన్ని సుపరెహే..మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ నందమూరి ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.