సమంత నిన్నటివరకు చికెన్ గున్యా ఫీవర్ బారిన పడి ఇప్పుడే కోలుకుంది. మాములు ఫీవర్ కె పదిరోజులు రెస్ట్ కునే జనాలు ఉన్న ఈకాలంలొ సమంత చికెన్ గున్యా ఫీవర్ అంటే ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ అన్నిటి నుంచి కోలుకుని ఇమ్మిడియట్ గా జిమ్ లో జాయిన్ అయ్యింది.
మాయోసైటిస్ తో సఫర్ అయినప్పటికీ సమంత వర్కౌట్స్ మానలేదు. ఇప్పుడు కూడా సమంత చికెన్ గున్యా నుంచి కోలుకున్న వెంటనే జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ వీడియో వదలడమే కాదు, చికెన్ గున్యా నుంచి కోలుకోవడం భలే సరదాగా ఉంది అంటూ పెట్టిన జిమ్ వీడియో చూసి ఆమె అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు.
ప్రస్తుతం సమంత రఖ్త్ బంధ్ వెబ్ సీరీస్ చేస్తుంది. మరోపక్క ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలకు నిర్మాతగా మారింది.