ప్రముఖ మాజీ యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ అంటే తెలియని వారుండరు. సోషల్ మీడియా ప్రాచుర్యం అంటే ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ సెన్సేషన్ అవ్వకముందే యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, టిక్ టాల్క్ వీడియోస్ తో మొదటగా ఫేమస్ అయిన భార్గవ్ ఫన్ బకెట్ పేరుతొ ఎన్నో వీడియోస్ చేసాడు. ఎంత స్పీడుగా కేరీర్లో ఎదిగాడో అంతే స్పీడుగా అతను కిందపడిపోయాడు.
ఫన్ బకెట్ కోసం తనతో పని చేసిన మైనర్ బాలికను భార్గవ్ లైంగికంగా వేధించడంతో ఆమె కుటుంబ సభ్యులు బకెట్ భార్గవ్ పై పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా.. భార్గవ్ పై ఆరోపణలు రుజువు కావడంతో పోలీసులు అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రస్తుతం బెయిల్ పై ఉన్న భార్గవ్ కు విశాఖ కోర్టు షాకిచ్చింది.
విచారణలో భాగంగా బకెట్ భార్గవ్ పై నమోదైన అభియోగాలు నిజమేనని పలు కీలక ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించడంతో కోర్టు అన్ని ఆధారాలను పరిశీలించి భార్గవ్ ను దోషిగా తేల్చడమే కాదు… అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దానితో బకెట్ భార్గవ్ ఇకపై బయటికొచ్చే ఛాన్స్ లేదు అంటూ మాట్లాడుకుంటున్నారు నెటిజెన్స్.