జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ నుంచి విరామం తీసుకుని న్యూ ఇయర్ వేడుకలు కోసం భార్య పిల్లలతో కలిసి లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అఫీషియల్ గా తన న్యూ ఇయర్ ట్రిప్ అప్ డేట్ ఇవ్వకపోయినా ఎన్టీఆర్ ఫొటోస్ ఆయన ఫ్యామిలీ ఫొటోస్ ను తీసిన అభిమానులు వాటిని వైరల్ చేసారు.
ఇక న్యూ ఇయర్ వెకేషన్ నుంచి వచ్చాక ఎన్టీఆర్ ముంబై వెళతారని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ స్కాట్లాండ్ లో కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. స్కాట్లాండ్ కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్, ట్రావెల్ బ్లాగర్ ఎడిన్‌బర్గ్ అక్కడి మార్కెట్ అందాలను చూపించే క్రమంలో అనుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ ని తన వీడియోలో క్యాప్చర్ చేశాడు.
ఆ బ్లాగర్ ఎన్టీఆర్ వీడియోని పోస్ట్ చేస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ ఇండియన్ సినిమాలో డైనమిక్ ఫోర్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రూ ఐకాన్. పవర్ ఫుల్ యాక్టింగ్, ఎలక్ట్రిఫైయింగ్ డాన్స్ మూమెంట్స్ తో పాపులర్ అయిన ఈ స్టార్ హీరో తెలుగు సినిమాని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లే గ్లోబల్ స్టార్ అంటూ ఆ వీడియో ని షేర్ చేస్తూ రాసుకొచ్చాడు.
మరి ఎన్టీఆర్ అక్కడ స్కాట్లాండ్ ప్రజలతో కలిసిపోయి స్వేచ్ఛగా తిరుగుతున్న వీడియో ఇప్పుడు సొషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.