పుష్ప 2 రిలీజ్ అయ్యి 1850 కోట్లు సాధించిన హీరో ఎలా ఉండాలి, నాలుగు సక్సెస్ మీట్స్, ఐదు సెలెబ్రేషన్స్, ఆరు పార్టీలు అన్న రేంజ్ లో ఉండాలి. కానీ అల్లు అర్జున్ పరిస్థితి అలా లేదు, పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ రోజున సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ ఆనందాన్ని ఆవిరి చేసింది.
దానితో అల్లు అర్జున్ గత నెల రోజులుగా సైలెంట్ గా ఇంట్లోనే ఉంటున్నాడు. అతను నవ్వినా తప్పే, అతను మాట్లాడినా తప్పే, వేరేవారిని కలిసినా తప్పే అన్నట్టుగా అల్లు అర్జున్ ను తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంది. ఇక అల్లు అర్జున్ శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించి వచ్చాక సైలెంట్ గా తన తదుపరి సినిమా పనులు మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది.
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. త్రివిక్రమ్ గత ఏడాది కాలంగా అల్లు అర్జున్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా వున్నారు. ఇప్పుడు కామ్ గా త్రివిక్రమ్-అల్లు అర్జున్ నడుమ స్టోరీ డిస్కర్షన్ స్టార్ట్ అవడమే కాదు, ఆ ప్రాజెక్ట్ కి సంబందించిన పనులు కూడా మొదలయ్యాయి అని తెలుస్తోంది.
సంక్రాంతి తర్వాత అల్లు అర్జున్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి సంబందించిన పూజ కార్యక్రమాలను సైలెంట్ గా ముగించేసి నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళిపోతారని టాక్.