గేమ్ చేంజర్ ఎలా ఉంది, శంకర్ ప్రేక్షకులను మెప్పించారా, ఇండియన్ 2 డిజాస్టర్ ని మరిపించారా అనేది పక్కనపెడితే గేమ్ చేంజర్ సినిమాని కేవలం రామ్ చరణ్ కోసం చూడాలి. ఇది మనం చెప్పేది కాదు, మెగా ఫ్యాన్స్ వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు.
శంకర్ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే సినిమా సూపర్ హిట్
గేమ్ చేంజర్ లోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కచ్చితంగా ఆడియన్స్ ని మెప్పిస్తుంది...
ఇక మన రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్ లో నటన అయితే వేరే లెవెల్
అత్యవసర సమయంలో ఫోన్లో విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు నత్తి వల్ల మాటలు సరిగ్గా పలకలేక ఇబ్బంది పడిన సీన్ లో అయితే కంటతడి పెట్టించేసాడు రామ్ చరణ్..
నత్తి సమస్య ఉన్నవాళ్లని చూసి మనం నవ్వుకుంటాం కానీ వాళ్ళ సమస్యని స్పష్టంగా చూపించి.. హృదయాలను కదిలించేశాడు శంకర్
అప్పన్న(రామ్ చరణ్) క్యారెక్టర్ కోసం ఎన్ని సార్లు అయినా సినిమా చూడొచ్చు అంటూ మెగా అభిమానులు రామ్ చరణ్ కోసం గేమ్ ఛేంజర్ ని చూడమంటున్నారు.