ధమాకా నుంచి పుష్ప 2 వరకు శ్రీలీల డాన్స్ ని అభిమానించని ప్రేక్షకులు ఉండరు. ధమాకా తర్వాత ఎన్ని సినిమాలు నిరాశపరిచిన శ్రీలీల అవకాశాలను ఎవ్వరూ ఆపలేకపోయారు. గుంటూరు కారంతో గ్యాప్ వచ్చినా దానిని ఇట్టే ఫిల్ చేసేసింది పాప. పుష్ప2 కిస్సిక్ సాంగ్ తర్వాత శ్రీలీల పేరు బాలీవుడ్ కి పాకిపోయింది.
నిన్నమొన్నటివరకు శ్రీలీల బాలీవుడ్ ఆఫర్స్ పై ఉట్టి ప్రచారమే జరిగింది. కానీ ఇప్పుడు శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ దాదాపుగా ఖరారైంది. అమ్మడు సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది అనే సంకేతాలు ఆమె ముంబైలో తిరుగుతున్న ప్రదేశాలు డిసైడ్ చేస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలో ఇప్పటికప్పుడు ట్రెండీ ఫొటోస్ తో ఆకట్టుకునే శ్రీలీల తాజాగా వదిలిన లుక్ చూస్తే సింపుల్ గానే ఉన్నా.. వావ్ అనేలా ఉంది. శ్రీలీల బ్యూటిఫుల్ పిక్ మాత్రం ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.