పుష్ప 2 తో నార్త్ లో 1000 కోట్ల రికార్డ్ కలెక్షన్స్ హీరోగా అల్లు అర్జున్ ఓ బెంచ్ మార్క్ సెట్ చేసారు. పుష్ప 1 కి మించి పుష్ప 2 తో నార్త్ లో అల్లు అర్జున్ బలమైన హీరోగా ఎదిగారు. చిన్న చిన్న ప్రమోషన్స్ తోనె పుష్ప 2 ని 1000 కోట్ల దగ్గరకి చేర్చిన అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి. త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఫిక్స్.
గత నెల రోజులుగా అల్లు అర్జున్ సైలెంట్ గా ఇంట్లోనే ఉన్నారు. నెలరోజులుగా ఇంటిపట్టునే ఉన్న అల్లు అర్జున్ నిన్న ముంబై వెళుతూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన వీడియోస్ వైరల్ అయ్యాయి. ముంబైలో దిగిన అల్లు అర్జున్ అక్కడ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీని కలిసి సందడి చేసారు.
గతంలోనూ అల్లు అర్జున్ సంజయ్ లీలా భన్సాలీతో మీట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆయనతో అల్లు అర్జున్ మరోసారి మీట్ అవడంతో త్రివిక్రమ్ తర్వాత అల్లు అర్జున్ సంజయ్ లీల తో ఏమైనా ప్రాజెక్ట్ పై డిస్కర్స్ చేస్తున్నారా అంటూ అల్లు అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ మొదలయ్యింది.