Advertisementt

క్లింకార కు అదే పెద్ద గిఫ్ట్ - రామ్ చరణ్

Thu 09th Jan 2025 03:48 PM
ram charan  క్లింకార కు అదే పెద్ద గిఫ్ట్ - రామ్ చరణ్
Ram Charan Reveals When Hell Share Daughter Klin Kaaras Face క్లింకార కు అదే పెద్ద గిఫ్ట్ - రామ్ చరణ్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ లైఫ్ లోకి 2023 జూన్ లో క్లింకార రూపంలో మహాలక్షి అడుగుపెట్టడమే కాదు ఎనలేని ఆనందాలను తీసుకొచ్చింది తన కూతురు. రామ్ చరణ్ తమ కుమార్తె క్లింకార ని ఎప్పుడు చూపిస్తారూ అంటూ మెగా అభిమానులు గత ఏడాదిన్నరగా వెయిట్ చేస్తున్నారు. కానీ చరణ్ మాత్రం తన కూతురు ఫేస్ రివీల్ చెయ్యట్లేదు. 

తాజాగా రామ్ చరణ్ ని అన్ స్టాపబుల్ స్టేజ్ పై బాలయ్య.. నీ కూతురు ని ఎప్పడు చూపిస్తావ్ అని అడిగారు. నా కూతురు క్లింకార చాలా సన్నగా ఉంటుంది. అల్లరి బాగా చేస్తుంది. క్లింకార ను ఎప్పుడు చూపిస్తావ్ అంటూ అందరూ అడుగుతూ ఉంటారు. కానీ క్లింకార కి ప్రైవసీ చాలా అవసరం. మనం ఎంత కోరుకున్నా అది దొరకడం లేదు, నేను నా కూతురుకు ఇచ్చే పెద్ద బహుమతి ప్రైవసీ అంటూ చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 

స్కూల్ డేస్ లో మమ్మల్ని అందరూ గుర్తు పట్టేవారు, దానితో మేము ఫ్రీగా ఉండలేకపోయే వాళ్ళం. కానీ నా కూతురు తనంతట తాను ఎదగడానికి, తన మొహాన్ని వీలైనంతగా దాచిపెట్టడానికే ట్రై చేస్తాను. ఒత్తిడి లేకుండా పెరగడానికి ప్రైవసీ అవసరం. అది నా కుతురుకి ఇవ్వాలి అనుకుంటున్నాను. 

ఇప్పుడు మా పాప అమ్మ అమ్మ అంటుంది. నాన్న అని పిలవడం లేదు. తాను నాన్న అంటూ ఎప్పుడు పిలుస్తుందో అప్పుడు క్లింకార ను ప్రపంచానికి పరిచయం చేస్తాను అంటూ చరణ్ తన కూతురు గురించి చెప్పుకొచ్చాడు. 

Ram Charan Reveals When Hell Share Daughter Klin Kaaras Face :

Ram Charan recently shared his plans to introduce his daughter

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ