దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబుకు ఊరట లభించింది. ఐతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌కు మాత్రం ధర్మాసనం ఝలక్ ఇచ్చింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు మందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ క్రమంలో వాడీవేడీ వాదనలు జరిగాయి. ఒకింత మోహన్ బాబుకు ఊరట లభించినట్టే కానీ ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది ధర్మాసనం.
జైలుకు పంపాలా..?
సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీం ధర్మాసనం నాలుగు వారాలపాటు మోహన్ బాబుపై ఎలాంటి బలవంతపు చర్యలు, అరెస్ట్ కూడా చేయొద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలకు కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలో నష్టపరిహారం కావాలా..? లేక జైలుకు పంపాలా..? అని ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లో అన్ని విషయాలు స్పష్టం చేయాలని కూడా న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలో జడ్జిమెంట్ ఇస్తామని.. అలాగే ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా? అని మోహన్ బాబు తరపున వాదన వినిపించిన సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గిను ధర్మాసనం ప్రశ్నించింది.
అయ్యో.. కేటీఆర్!
సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. క్వాష్ పిటిషన్ రేపు విచారణకు తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించినది. మళ్ళీ రేపే విచారించాలని కేటీఆర్ న్యాయవాది కోరగా.. రేపు కాదు కదా ఈ వారం మొత్తం కుదరదని వచ్చే బుధవారం విచారిస్తామని భూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో మాజీ మంత్రికి ఊరట దక్కలేదు. మరోవైపు ఏసీబీ విచారణలో కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు ? ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు ? నిధులు బదిలీ చేయాలని బలవంతం చేశారా ? మీరు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు తెలుసా ? కనీసం అప్పటి ముఖ్యమంత్రి అనుమతి అయినా తీసుకున్నారా ? ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి ? అని ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు.