గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో మొదలు కాబోయే డ్రాగన్(వర్కింగ్ టైటిల్) మూవీ రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతి తర్వాత మొదలు కాబోతుంది అని తెలుస్తోంది. నీల్-ఎన్టీఆర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ చిత్రం కోసం లొకేషన్స్ ఫైనల్ చెయ్యడమే కాదు, ఇందులో నటించబోయే కీలక నటులను కూడా ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది.
అయితే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబో మూవీ బ్లాక్ థీమ్ లో ఉంటుందా లేదంటే అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉన్న క్యూరియాసిటీ. తాజాగా ఎన్టీఆర్-నీల్ డ్రాగన్ మూవీ డ్రగ్ మాఫియా చుట్టూ తిరగబోతుంది అని తెలుస్తోంది. డ్రగ్స్ నేపథ్యంలో కొకైన్, గంజాయి స్మగ్లింగ్ పై ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టుగా చెబుతున్నారు.
ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్స్ మాములుగా లేవు అంటున్నారు. మలయాళంలో స్టార్ నటులైన బీజూ బీనన్‌ని, టోవినో థామస్‌ని ఎంచుకొన్నట్లుగా, హీరోయిన్ గా కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ ని ఖరారు చేసినట్లుగా వార్తలున్నాయి. దీన్ని బట్టి ఎన్టీఆర్ మూవీ కోసం ప్రశాంత్ నీల్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లుగా మాత్రం అర్ధమవుతుంది.