సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కలయికలో తెరకెక్కుతున్న కూలి చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. జైలర్ తర్వాత వెట్టయ్యన్ రజిని ఫ్యాన్స్ ని నిరాశ పరిచినా ప్రస్తుతం సూపర్ స్టార్ లోకేష్ కనగరాజ్ తో కలిసి వర్క్ చెయ్యడంతో కూలి పై విపరీతమైన అంచనాలు మొదలయ్యాయి.
అయితే రజినీకాంత్ కూలి చిత్రాన్ని బాలీవుడ్ లో తెరకెక్కుతున్న వార్ 2 తో పోటీకి సిద్ధం చేస్తున్నారనే వార్త చూసి రజినీకాంత్ -ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో పోటీ పడేందుకు సిద్ధమయ్యారు, కూలితో వార్ కు సిద్ధమవుతున్న ఎన్టీఆర్, హృతిక్ అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్-హృతిక్ కలయికలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ 2ని ఆగస్ట్ 14 విడుదల చేసేందుకు మేకర్స్ అఫీషియల్ గా డేట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న వార్ 2పైకి ఇప్పుడు రజినీకాంత్ కూలి తో బాక్సాఫీసు పోటీకి అందులోను పాన్ ఇండియా మర్కెట్ లో సిద్దమవ్వడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.