రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన మూవీ అంటే ఎలా ఉండాలి, ఏ రేంజ్ ప్రమోషన్స్ ఉండాలి. కానీ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ విషయంలో అదేమీ లేదు. ఈ చిత్రం అసలు పాన్ ఇండియా మూవీ నేనా అనే అనుమానం ఇప్పుడు అందరిలో మెదులుతుంది. కారణం గేమ్ చేంజర్ ప్రమోషన్స్ చూస్తే అదే అనిపిస్తుంది.
ఆర్.ఆర్.ఆర్ రామ్ చరణ్ నుంచి రాబోతున్న మూవీని ఎలా ప్రమోట్ చేస్తే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అనే విషయంలో దిల్ రాజు, శంకర్ ఇద్దరికి క్లారిటీ లేదా, దిల్ రాజు ఇంత భారీ బడ్జెట్ మూవీ ప్రమోషన్స్ ను హ్యాండిల్ చెయ్యలేకపోయారా, అసలు నార్త్ లో సినిమాని రిలీజ్ చేస్తూ ముంబైలో బిగ్ బాస్ షో కి వెళ్లి ప్రెస్ మీట్ పెడితే సినిమా చూస్తారా..
గేమ్ చెంజర్ హిట్ టాక్ వస్తే తప్ప నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అవడం కష్టం. దేవర, పుష్ప 2 విడుదలకు ముందు ఉన్న హైప్ ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో కనిపించడం లేదు, పాన్ ఇండియా ప్రమోషన్స్ లేవు, సినిమాకి ఓపెనింగ్స్ ఉంటాయా అనేది ఇప్పుడు అందరిలో కాదు కాదు మెగా ఫ్యాన్స్ లో మొదలైన టెన్షన్.