దేవర లాంటి సక్సెస్ ఫుల్ చిత్రంతో సౌత్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. ఇప్పుడు రామ్ చరణ్ RC 16 సెట్స్ లోకి ఎంటర్ అయ్యేందుకు రెడీ అవుతుంది. ఇక 2025 న్యూ ఇయర్ వేడుకలనే కాదు ఆ తర్వాత తిరుపతి శ్రీవారి దర్శనంలోనూ జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి కనిపించింది.
తెలుగు సాంప్రదాయంలో లంగాఓణిలో జాన్వీ కపూర్ శిఖర్ తో కలిసి శ్రీవారి దర్శనం చేసుకుంది. ఇక దేవుడి దగ్గర ఎంతో పద్దతిగా కనిపించే జాన్వీ కపూర్.. సోషల్ మీడియా కానివ్వండి, ఏదైనా ఈవెంట్స్ లో కానివ్వండి టూ గ్లామర్ షో చేస్తుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోస్ మాత్రం యూత్ కి కిక్ ఇస్తుంది.
తాజాగా జాన్వీ కపూర్ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న లుక్ వదిలింది. అందాలు ఆరబోస్తూ జాన్వీ కపూర్ ఇచ్చిన గ్లామర్ ఫోజులకు మాత్రం ఫిదా కాదు గుండె జారీ పోవాల్సిందే. మీరు కూడా జాన్వీ బ్లాక్ అండ్ వైట్ పిక్స్ పై ఓ లుక్ వెయ్యండి.