బాలకృష్ణ కు ఎన్టీఆర్ అంటే అంతిష్టమా..? ఎన్టీఆర్ సినిమా గురించి బాలయ్య నిజంగా మాట్లాడారా? ఎప్పుడూ పబ్లిక్ ప్లాట్ ఫామ్ పై ఎన్టీఆర్ గురించి మాట్లాడని వ్యక్తి ఇతరులతో వ్యక్తిగతంగా ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తారా అనేది ఇప్పుడు అందరి మనసులో కాదు ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉన్న అనుమానం.
బాలయ్య ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా డిస్కర్స్ చేసారు, ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ గురించి మట్లాడారు అంటే ఎవరైనా నమ్ముతారా? అసలు బాలయ్య నోట ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది అంటే నమ్మశక్యంగా లేదు అంటూ చాలామంది గుసగుసలాడుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్-బాలయ్య విషయాన్ని దర్శకుడు బాబీ, నాగవంశీ మాట్లాడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు నెటిజెన్స్.
డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో భగంగా నాగవంశీ ఎన్టీఆర్-బాలయ్య కు మధ్య అనుబంధం చాలా ఉంది, ఎన్టీఆర్ నటించిన ఓ కేరెక్టర్ గురించి నా దగ్గర, బాబీ దగ్గర ప్రస్తావించారంటూ మట్లాడడం..
దర్శకుడు బాబీ కూడా డాకు మహారాజ్ ప్రెస్ మీట్ లో బాలయ్యకి ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ అంటే చాలా ఇష్టం, ఆ విషయమే నాగవంశీ తో, నాతో చెప్పారని చెప్పడం.. అన్ని పబ్లిసిటీ స్టంట్ లో భాగమంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.. నిజంగా బాలయ్య ఎన్టీఆర్ గురించి మాట్లాడితే నందమూరి ఫ్యాన్స్ కన్నా ఎక్కువ సంతోషించేవాళ్ళెవరూ ఉండరు.