ఈమధ్యన సౌత్ మూవీస్ హిందీ బాక్సాఫీసు పై దండెత్తడం అక్కడి స్టార్ హీరోలు భరించలేకపోతున్నారు. పైకి పోగుడుతున్నారే తప్ప లోలోపల కుళ్లిపోతున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ఇండస్ట్రీనే చెప్పుకునే జనాలు ఈ రోజు పాన్ ఇండియా మూవీస్ అంటూ సౌత్ ని పొగిడడం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు.
రీసెంట్ టైమ్స్ లో అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ మేకర్స్ కి మెదడు లేదు అంటూ మాట్లాడిన మాటలు ఇంకా వైరల్ అవుతున్న సమయంలోనే హిందీ స్టార్ హీరో అజయ్ దేవగన్ హిందీ ఆడియన్స్ పై చేసిన వ్యాఖ్యలు చూస్తే మెల్లగా హిందీ హీరోలు రియలైజ్ అవుతున్నారనిపించకమానదు.
నార్త్ ఆడియన్స్ మారిపోయారు, గతంలో క్షమించేవాళ్ళు, ఇప్పుడు క్షమించడం మానేశారంటూ అజయ్ దేవగన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
ఆయన ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ గతంలో మేము చేసే సినిమాల నుంచి ఎంతో కొంత నేర్చుకునేవాళ్ళం, అప్పుడు ప్రేక్షకులు కూడా మా చిన్న చిన్న తప్పులను చూసి చూడకుండా వదిలేసేవారు, కానీ ఇప్పుడు ఆడియన్స్ మారిపోయారు, ప్రతిదీ భూతద్దంలో చూస్తున్నారు. ఏ మాత్రం తప్పు కనిపించినా క్షమించడం లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గరపెట్టుకుని సినిమాలు చెయ్యాలంటూ అజయ్ దేవగన్ చెప్పుకొచ్చారు.