Advertisementt

చైనా లో కొత్త వైరస్ - ఏమిటి కన్ఫ్యూజన్

Tue 07th Jan 2025 03:59 PM
hmpv  చైనా లో కొత్త వైరస్ - ఏమిటి కన్ఫ్యూజన్
New Virus in China - Whats the Confusion చైనా లో కొత్త వైరస్ - ఏమిటి కన్ఫ్యూజన్
Advertisement
Ads by CJ

డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా కల్లోలం ఎప్పటికి మరిచిపోలేము. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఒణికించేసింది. మరి అదే చైనాలో మరో కొత్త వైరస్ అంటే నిజంగా అది ప్రజలను భయబ్రాంతులకు గురవ్వడంలో షాకేముంది. చైనాలో కొత్త వైరస్, అది జనాలను మింగేస్తుంది, అక్కడి హాస్పిటల్స్ అన్ని కిక్కిరిసిపోయాయి. అక్కడి వారు మాస్క్ లేకుండా బయట తిరగడం లేదు అంటూ సోషల్ మీడియా మొత్తం చైనా కొత్త వైరస్ పై రకరకాల వార్తలు వినబడుతున్నాయి. 

కానీ చైనా లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతవరకు ఈ వార్తలను ధృవీకరించలేదు. ప్రస్తుతం చాలామంది జలుబు, దగ్గు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులుతో బాధపడుతున్నారు. ఇవి వైరస్‌ లక్షణాలుగా వీటిని భావిస్తున్నారు. కరోనాకు ఎలాంటి లక్షణాలైతే వున్నాయో ఆలాంటి లక్షణాలే ఈ వైరస్‌లో కూడా కనిపిస్తున్నాయని, రోగ నిరోధక శక్తి వున్నవారు ఎక్కువగా వీటి బారిన పడే అవకాశం వుందని డాక్టర్లు చెబుతున్నారు. 

అయితే చైనాలో ఎలాంటి వైరస్ లేదు, అసలు సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ నమ్మవద్దు అంటూ చైనాలో నివాసముంటున్న ఓ తెలుగు వ్యక్తి వదిలిన వీడియో చూసి అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆంధ్రకు చెందిన ఓ వ్యక్తి వీడియో చూపిస్తూ చైనాలో అంతా నార్మల్ గానే ఉంది, ఇక్కడ ఎలాంటి వైరస్ లేదు, ఎవరు భయపడవద్దు, బయటతిరిగేవారు కూడా మాస్క్ ధరించడం లేదు, సోషల్ మీడియా రూమర్స్ నమ్మొద్దు అంటూ చేసిన వీడియో చూసి ఏ వార్తను నమ్మాలో అంటూ జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. 

New Virus in China - Whats the Confusion:

What We Know About HMPV the Virus Spreading in China

Tags:   HMPV
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ