గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న విడుదల కాబోతోన్న సందర్భంగా.. ఇందులో విలన్‌గా నటించిన నటుడు ఎస్.జె. సూర్య మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఎస్.జె. సూర్య ఇంటర్వ్యూ హైలెట్స్ ఇవే..
- శంకర్ గారు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. గేమ్ చేంజర్ సినిమాలో ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటూ వెళ్లిపోయా. ఇందులో నా యాక్టింగ్ చూసే.. ఇండియన్ 2లో కూడా అవకాశం ఇచ్చారు.
- రామ్ చరణ్ అద్భుతమైన నటుడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్. గేమ్ చేంజర్‌లో ఆయన డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంత హుందాగా కనిపిస్తారో.. అప్పన్న పాత్రలో అంతే గొప్పగా నటించారు. అప్పన్న రోల్ చరణ్‌కు లైఫ్ టైం గుర్తుండిపోయేలా పాత్ర అవుతుంది.
- గేమ్ చేంజర్ సినిమాకు నేను నటుడిగానే వర్క్ చేశాను. నటుడిగా ఉన్నప్పుడు కేవలం నటుడిగానే ఆలోచించాలి. అయినా శంకర్ గారికి సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయి నాకు లేదు. ఆయన చాలా విజనరీ డైరెక్టర్. రాజమౌళి వంటి వారే శంకర్ గారి గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసు కదా..
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకకు రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నా గురించి మాట్లాడుతూ ఉంటే నాకు చెప్పలేని ఆనందం కలిగింది. నోట మాట రాలేదు. ఆయన్ను హత్తుకున్నప్పుడు నాకు తెలియని ఆనందం కలిగింది. నిజాయితీగా కష్టపడే వారిని ఆయన ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు.
- ఓ నిజాయితీగా ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీత పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్ గేమే ఈ గేమ్ చేంజర్ సినిమా. అందరినీ అలరించేలా ఈ మూవీ ఉంటుంది.
- గేమ్ చేంజర్ సినిమా షూటింగ్‌కు ముందే ప్రిపేర్ అయ్యేవాడిని. ఈ సినిమా పరంగా నాకు టఫ్ అనిపించింది మాత్రం డబ్బింగే. ఈ కారెక్టర్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. అందుకే తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను.
- గేమ్ చేంజర్‌లో శంకర్ గారు క్రియేట్ చేసిన ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. రామ్ చరణ్ గారి సీన్లు, నా సీన్లు అద్భుతంగా వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఉండే సీన్లు ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి. ఇవన్నీ కాకుండా.. రీసెంట్‌గానే నేను జరగండి పాటను చూశాను. లిరికల్ వీడియో వచ్చినప్పుడు నేను కాస్త నిరుత్సాహపడ్డాను. కానీ పూర్తి పాటను చూసి షాక్ అయ్యాను. ఈ ఒక్క పాటకే మనం పెట్టే టికెట్ డబ్బులు సరిపోతాయనిపిస్తుంది.
- ప్రస్తుతం నాకు నటుడిగా చాలా కంఫర్ట్‌గా ఉంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశా. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. మాత్రం అతనితో ఖుషి 2 చేసే అవకాశం ఉంటుంది.
- దిల్ రాజు ఆల్ రౌండర్. కేవలం డబ్బులు పెట్టి సినిమాలు తీసే వాళ్లని నిర్మాత అని చెప్పలేం. ఆయనకు కథల మీద మంచి పట్టుంది. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు. అందుకే దిల్ రాజు ఆల్ రౌండర్ అన్నాను.