Advertisementt

డాకు మహారాజ్.. డిజప్పాయింట్ చేశాడు

Tue 07th Jan 2025 11:00 AM
daaku maharaaj usa event  డాకు మహారాజ్.. డిజప్పాయింట్ చేశాడు
Fans Disappointed by Balayya Daaku Maharaaj USA Event డాకు మహారాజ్.. డిజప్పాయింట్ చేశాడు
Advertisement
Ads by CJ

అవును.. డాకు మహారాజ్ డిజప్పాయింట్ చేశాడు.. ఈ మాట అంటున్నది ఎవరో తెలుసా? డల్లాస్‌లోని తెలుగు ప్రజలు. ఈ చిత్ర ట్రైలర్‌ ఆదివారం ఉదయం విడుదలైన విషయం తెలిసిందే. ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని డల్లాస్‌లో నిర్వహించారు. అంతకు ముందు రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుక అమెరికాలో గ్రాండ్‌గా జరిగింది. అదే ఫస్ట్ అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుక కావడంతో మేకర్స్ గ్రాండ్‌గా జరిపారు. అయితే ఆ వెంటనే బాలయ్య కూడా అమెరికాలో తన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రకటించగానే.. అంతా ఆశ్చర్యపోయారు. 

నందమూరి నటసింహం బాలయ్య ఈవెంట్ అంటే.. అమెరికాలో సైతం దద్దరిల్లిపోతుందని అంతా అనుకున్నారు కానీ.. అక్కడి తెలుగు వారంతా నీరసపడేలా ఈవెంట్ జరిగిందని అంతా నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఇలాంటి వేడుకను ఎప్పుడూ నిర్వహించవద్దంటూ బాలయ్య అభిమానులు సైతం కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగిన తర్వాత దాదాపు ఓ నాలుగైదు రోజుల పాటు ఆ వేడుకలో మాట్లాడిన సెలబ్రిటీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ బాలయ్య ట్రైలర్ లాంచ్ వేడుకకు సంబంధించి పెద్దగా వీడియోలే దర్శనమివ్వకపోవడం అభిమానులను డిజప్పాయింట్ చేసింది. అంతేకాదు, ఈ వేడుకకు భారీగా అభిమానులు తరలివచ్చినా.. యాంకర్ ఉదయభాను, బాలయ్య స్పీచ్ తప్పితే ఎంటర్‌టైన్ చేసే విధంగా ఏం ఏర్పాట్లు చేయలేదని, చిత్రయూనిట్ నుండి బాలయ్య తప్పితే మరో ఫేస్ కనిపించలేదనేలా టాక్ అయితే నడుస్తోంది. మరి ఈ టాక్‌పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో.. చూడాల్సి ఉంది. 

దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 12 జనవరి, 2025న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో ఈ సినిమా విడుదలకానుంది.

Fans Disappointed by Balayya Daaku Maharaaj USA Event:

Balayya Daaku Maharaaj Trailer Launch in Dallas Falls Flat, Fans Express Disappointment

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ