నటి పూనమ్ కౌర్ ఈసారి దాగుడు మూతలు లేకుండా డైరెక్ట్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ట్వీట్ పేల్చారు. ఇంతకు ముందు ఆమె ఇన్ డైరెక్ట్‌గా వేసే ట్వీట్స్‌లో త్రివిక్రమ్‌ను అంటుందో, లేదంటే పవన్ కళ్యాణ్‌ని అంటుందో అర్థంకాక అంతా కన్ఫ్యూజ్ అయ్యేవారు. అయితే ఈసారి మాత్రం క్లారిటీగా పోస్ట్ చేయడమే కాకుండా.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ని ఇరకాటంలో పెట్టేసింది.
ట్విట్టర్ ఎక్స్ వేదికగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నేను ఫిర్యాదు చేసి చాలా కాలమైంది. కానీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సరికదా.. అసలు ఎటువంటి స్పందన లేదు. నా జీవితాన్ని నాశనం చేసి.. నాకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని లేకుండా చేసిన త్రివిక్రమ్‌పై మా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. పైగా ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆయనకు ఇండస్ట్రీ పెద్దల నుండి సహకారం అందుతుంది అని ఆమె ఆరోపణలు చేసింది.
దీనికి మా తరపున కోశాధికారి శివబాలాజీ స్పందిస్తూ.. పూనమ్, మీరు చేసిన ఫిర్యాదు మాకు అందలేదు. గతంలో మీరు ఫిర్యాదు చేసినట్లుగా కూడా ఎక్కడా రికార్డులలో లేదు. మీకు న్యాయం జరగాలంటే మా లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. ఇలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.. అని బదులిచ్చారు. దీంతో.. మోహన్ బాబు, అల్లు అర్జున్ వివాదాల తర్వాత మరో మేత మీడియాకు దొరికినట్లయింది. మరి మా స్పందనపై పూనమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.