నందమూరి బాలకృష్ణ లైనప్ మాములుగా లేదు, ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్‌తో జనవరి 12న సంక్రాంతి స్పెషల్‌గా బాలయ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈలోపే బాలయ్య తన తదుపరి చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో మొదలు పెట్టేసారు. అఖండకు సీక్వెల్‌గా అఖండ తాండవంతో రాబోతున్న బాలయ్య షూటింగ్ మొదలు పెట్టడమే కాదు కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసేశారు.
ఆ తర్వాత బాలయ్య మరోసారి గోపీచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీరసింహ రెడ్డి కాంబోని రిపీట్ చేయబోతున్నారని సమాచారం. గోపీచంద్ మలినేని, బాలయ్యల మధ్య రీసెంట్‌గా స్టోరీ డిస్కర్షన్స్ జరిగినట్టుగా సోషల్ మీడియా టాక్.
మరి వీరసింహ రెడ్డితో బాలయ్యను పవర్ ఫుల్ మాస్ యాక్షన్‌తో అభిమానులతో విజిల్స్ వేయించిన గోపీచంద్.. మళ్లీ బాలయ్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి కథతో రాబోతున్నారో అంటూ అప్పుడే నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్, బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌తో జాట్ అనే మూవీ చేస్తున్నారు.