Advertisementt

సిగ్గో సిగ్గు.. ఇదేనా టీడీపీ కూటమి పాలన?

Mon 06th Jan 2025 11:05 AM
allegations on nda kutami mla  సిగ్గో సిగ్గు.. ఇదేనా టీడీపీ కూటమి పాలన?
TDP Coalition Faces Allegations of Corruption and Mismanagement as Ministers Actions Spark Outrage సిగ్గో సిగ్గు.. ఇదేనా టీడీపీ కూటమి పాలన?
Advertisement
Ads by CJ

అదిగో వైసీపీ మొత్తం కుంభకోణాలు చేసింది.. ఇదిగో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది..! ఆంధ్రా మరో శ్రీలంక అవుతోంది..! మేం వస్తే సంపద సృష్టిస్తాం.. ప్రజలకు పంచుతాం..! అని ఒకటా రెండా ఎన్నెన్ని అబ్బో ఆ మాటలు, హామీలు అన్నీ ఇన్ని కావు. తీరా చూస్తే ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. సర్వ నాశనం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇదంతా ఎవరో చెప్పడం లేదు.. టీడీపీ అనుయాయులు, అనుకూల మీడియా, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదే.

మళ్ళీ అవుతామా..?

మళ్ళీ మంత్రి అవుతామో లేదో.. అసలు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందో లేదో అని ఎన్డీఏ కూటమి పార్టీ ఎమ్మెల్యేల్లో భయం మొదలైందా..? అంటే వందకు వెయ్యి శాతం ఇదే అక్షరాలా నిజం. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని అక్షరాలా పాటించేస్తున్నారు. ఇందులో మంత్రులు తక్కువేం కాదు. ఒకరా ఇద్దరా చాలా మంది పైన అవినీతి, అక్రమాల ఆరోపణలు ఉన్నాయి. జూనియర్, సీనియర్ మంత్రులు అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ.. ఏం కావాలంటే అది సెటిల్ చేసేసుకుంటున్నారు. ఇందుకు టీడీపీ అనుకూల మీడియా రాసే కథనాలే ప్రత్యక్ష సాక్ష్యం. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎక్కడ పడితే అక్కడ.. నియోజకవర్గం, జిల్లా దాటి మరీ సెటిల్మెంట్స్ చేస్తున్న పరిస్థితి.

ఒక్క పీఏ ఇన్ని కోట్లా..?

ఒక మంత్రికి పీఏగా ఉన్న వ్యక్తి టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల వ్యవధిలోనే ఐదు కోట్ల రూపాయలు సంపాదించాడు అంటే..? దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు..? ఒకటా రెండా పేకాట, ఇసుక, మద్యం, బదిలీలు, పోస్టింగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉన్నాయ్. ఇదంతా హోం మంత్రి వంగలపూడి అనితకు తెలియకుండా జరుగుతుందా..? మంత్రి తర్వాత నియోజకవర్గంలో, హోం శాఖలో అంతా నేనే అన్నట్టుగా వ్యవహరించిన పరిస్థితి. పోనీ రెండు నెలలుగా ఇంటెలిజెన్సీ, సీఎంవో పదే పదే హెచ్చరించినా లెక్క చేయకపోవడం ఏంటి? తిరిగి మంత్రి స్పందిస్తూ పీఏను రెండు, మూడు నెలలుగా నేనే హెచ్చరించాను..? మారలేదు..? అని మాట్లాడటం ఏంటి? ఈ మాటలు జనాలు ఎలా తీసుకుంటారు..? ఇదేనా సభ్యత.

బాబోయ్ ఇంకెన్నో..?

రాయలసీమకు చెందిన మంత్రి తమ్ముడు నియోజకవర్గంలోనే కాదు జిల్లా, పక్క జిల్లా మొత్తం ఏం కావాలన్నా సరే సెటిల్ చేస్తున్న పరిస్థితి. ఇక ఆయన భార్య ఐతే అంతకు మించి. ఆఖరికి ఆయన కుమారుడిని సైతం అడ్డుపెట్టుకొని మంత్రి అనుచరులు దందాలు చేస్తున్నారంటే ఏంటి ఇది..? అసలు సభ్య సమాజానికి ఏమని సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు..? ఫ్యామిలీ ఫ్యామిలీ ఇలా చేస్తూ పోతే అర్థం ఏంటి? ఇలా చేస్తున్న మంత్రులు మొత్తం ఆరు మంది ఉన్నారని.. వాళ్ళు అంతా డేంజర్ జోన్ లో ఉన్నారని.. వాళ్ళను ఏ క్షణమైనా మంత్రి పదవి నుంచి తీసేయొచ్చు అని కూడా సీఎంవో నుంచి నెలరోజులుగా లీకులు వస్తున్నాయ్.

పక్క రాష్ట్రంలో గానాభజానా..!

మహాప్రభో మీ మంత్రి సంగతి కాస్త చూసుకోండి.. మీ మంత్రి ఆగడాలు అన్నీ, ఇన్ని కావు మేం తట్టుకోలేకపోతున్నాం. ఏపీ నుంచి వచ్చి వారంలో మూడురోజులు హైదరాబాద్‌ స్టార్‌ హోటళ్లలో మకాం వేసి, అక్కడే సెటిల్‌మెంట్లు చేస్తున్నారని స్వయానా టీడీపీ అనుకూల మీడియా దినపత్రికలో రాసింది. అంతే కాదు హైదరాబాద్ వచ్చిన మూడు రోజుల్లో ఒక రోజంతా పంచాయతీలు, పరిష్కారాలు.. మిగిలిన రెండు రోజులూ జోరుగా గానాభజానా చేస్తున్నారు అంట. ఆఖరికి తెలంగాణ భూవ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్న పరిస్థితి. దీంతో నిఘా పెట్టిన  తెలంగాణ సర్కారు పక్కా ఆధారాలతో ఏపీ సీఎం చంద్రబాబుకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ చేసి చెప్పడం గమనార్హం.

జనసేన ఏం తక్కువ కాదే!

ఇలా ఒకటా రెండా.. చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు గురుంచి ఐతే అబ్బో ఆ కథలు అన్నీ ఇన్ని కావు. స్వయానా అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడి వార్నింగ్ ఇచ్చారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలా ఎవరికి ఎవరు..? ఒక పార్టీ ఒక ఎమ్మెల్యే అని కాదు కూటమిలో పరిస్థితి ఇలానే ఉందని సర్వేలు సైతం చంద్రబాబు తెప్పించుకున్నారని సమాచారం. ఈ వరుస ఆరోపణలు, పరిణామాలతో రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్న పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో ఐతే అబ్బో ఆ మాటలు రాయలేం. ఇదేనా ప్రజా పాలన? సిగ్గో సిగ్గు అంటూ రాజకీయ విశ్లేషకులు తిట్టిపోస్తున్నారు. సదరు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు చంద్రబాబు తీసుకుంటారు..? అనేది చూడాలి మరి.

TDP Coalition Faces Allegations of Corruption and Mismanagement as Ministers Actions Spark Outrage:

TDP Leadership Under Scrutiny: Accusations of Corruption and Poor Governance Rise Amidst Growing Public Discontent

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ