మహానటి కీర్తి సురేష్ తమ సాంప్రదాయంలో చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని హిందూ మతం ప్రకారం గోవాలో వివాహం చేసుకుంది. డిసెంబర్ 12న హిందూ సాంప్రదాయం ప్రకారం కీర్తి సురేష్ మెడలో ఆంటోని తాళి కట్టారు. ఇరు కుటుంబాల వారితో పాటుగా హీరో విజయ్ కూడా స్పెషల్‌గా ఈ పెళ్ళిలో పాల్గొన్నారు.
ఈ పెళ్లి అనంతరం, అంటే రెండు రోజులు తర్వాత కీర్తి సురేష్, ఆంటోని ఇంటి సంప్రదాయమైన క్రిస్టియన్ విధానంలో వివాహం చేసుకుంది. అయితే ముందుగానే తన తండ్రికి ఈ క్రిస్టియన్ వివాహం గురించి చెప్పగా కీర్తి సురేష్ తండ్రి ఒప్పుకున్నారట. అంతేకాదు, క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి కుమార్తెను ఆమె తండ్రి పెళ్లి కొడుకు వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
నా కోసం మీరు అలా చేస్తారా అని కీర్తి సురేష్ తన తండ్రిని అడగగా.. దానికి కీర్తి సురేష్ తండ్రి తప్పకుండా చేస్తాను, మనం రెండు సాంప్రదాయాల్లో వివాహం జరిపిస్తున్నాం కాబట్టి నేను ఆ సాంప్రదాయాలను పాటిస్తాను అన్నారు. ఆయన అలా చేస్తారని అనుకోలేదు. ముందు షాకయ్యాను. తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. నా కోసం నాన్న అలా చేశారు అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.