ఎన్టీఆర్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఎన్టీఆర్ లండన్ వెళ్లారు. ప్రస్తుతం ఆ సెలబ్రేషన్స్‌ని ముగించుకుని వారు హైదరాబాద్‌కి తిరిగి వచ్చేశారు కూడా. అంతకు ముందు ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. వార్ 2లో ఎన్టీఆర్‌కి సంబంధించిన చిత్రీకరణ ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది.
మరోపక్క ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ ఆగస్ట్‌లో అధికారికంగా మొదలైంది. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్-నీల్ రెగ్యులర్ షూట్‌కి వెళతారా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఆ తరుణం వచ్చేసింది. సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ఎన్టీఆర్-నీల్ రెగ్యులర్ షూట్ మొదలు కాబోతుంది అని తెలుస్తోంది.
అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ లోనే ఏ స్పెషల్ సెట్టో వేసి మూవీ స్టార్ట్ చేస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌కి చెందిన కర్ణాటక వెళ్లాల్సిందేనట. ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ కర్ణాటకలో మొదలు పెడతారనే వార్త చూడగానే నీల్ కోసం ఎన్టీఆర్ కర్ణాటక వెళ్లాల్సిందే అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.