మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ మధ్య చిరు యంగ్ లుక్స్ తో అదరగొట్టేస్తున్నారు. అయితే చిరు విశ్వంభర తర్వాత శ్రీకాంత్ ఓదెల చిత్రాన్ని ఓకే చేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. విశ్వంభర తర్వాత మెగాస్టార్ ఇమ్మిడియట్‌గా ఓదెల మూవీకి షిఫ్ట్ అవ్వడం లేదు. ఈ మధ్యలో ఆయన మరో మూవీ చేయబోతున్నారు.
అది అనిల్ రావిపూడితో అనేది క్లారిటీ వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్నాం అంటూ ప్రస్తుతం హడావిడి చేస్తున్న అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని చిరుతో లాక్ చేశారనే వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో.. అదే నిజమే అంటూ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేవారు. అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి శుక్రవారం మెగాస్టార్ చిరంజీవిని కలిసినట్లుగా సమాచారం.
శ్రీకాంత్ ఓదెల ఎలాగూ నాని ప్యారడైజ్ పూర్తి చేయాలి. మరోవైపు వెంకీతో అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం పూర్తి చేసి ఉన్నారు. అటు చిరు విశ్వంభర కూడా చివరి స్టేజ్‌లో ఉంది. విశ్వంభర పూర్తవగానే చిరు-అనిల్ రావిపూడి కాంబో పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. సంక్రాంతికి ఈ మూవీ అనౌన్స్ చేసే అవకాశం ఉందనేలా వార్తలు వినిపిస్తున్నాయి.