కిస్సిక్ పాటతో శ్రీలీల కి బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరుస్తుంది అనుకున్నారు చాలామంది కానీ అంతకుముందే శ్రీలీలకు వరుణ్ ధవన్ మూవీలో ఆఫర్ వచ్చినా .. ఆ సినిమా అసలు పట్టాలెక్కముందే అది ఆగిపోయింది అనే ప్రచారం ఉంది. అయితే శ్రీలీల పుష్ప 2 చిత్రంలో చేసిన స్పెషల్ సాంగ్ ఆమెకి నార్త్ నుంచి స్పెషల్ ఆఫర్స్ రావడానికి హెల్ప్ అవుతుంది అని ఆమె అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
అభిమానులు కోరుకున్నట్టే శ్రీలీల కు హిందీలో సూపర్బ్ ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా సమీర్ దర్శకత్వంలో తు మేరీ మై తేరి మై తేరా తు మేరాలో శ్రీలీలకు హీరోయిన్ అవకాశం దక్కబోతున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించబోతున్నారు.
ఈ చిత్రంలో శ్రీలీల ని హీరోయిన్ గా ఫైనల్ చేసి ఆమెతో చర్చలు జరుపుతున్నారట. మరి సక్సెస్ ఫుల్ హీరోతో శ్రీలీలకు బాలీవుడ్ ఎంట్రీ అవకాశం వస్తే వదులుకుంటుందా. ఒకవేళ ఒప్పుకుంటే అదే ఆమెకు బెస్ట్ నార్త్ డెబ్యూ అవుతుంది అంటున్నారు.