గేమ్ చెంజర్ హీరోయిన్ కియారా అద్వానీ గేమ్ చెంజర్ ట్రైలర్ ఈవెంట్ లో కనిపించకపోవడం పై మెగా అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. పాన్ ఇండియా ప్రమోషన్స్ లో హీరోయిన్ కనిపించకపోవడంపై వారు నిరాశపడిపోయారు. అయితే హైదరాబాద్ గేమ్ చెంజర్ ఈవెంట్ లో మిస్ అయిన కియారా ముంబైలో తేలింది.
రామ్ చరణ్-కియారా అద్వానీ కలిసి ముంబైలో పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్18 కి హాజరయ్యారు. హైదరాబాద్ లో కనిపించకపోయినా కియారా ముంబైలో చరణ్ తో కనిపించేసరికి మెగా ఫ్యాన్స్ కూలయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్-కియారా అద్వానీలు బిగ్ బాస్ 18 లోకి అడుగుపెట్టారు.
రేపు ముంబైలో జరగబోయే గేమ్ ఛేంజర్ ప్రెస్ మీట్లోనూ రామ్ చరణ్-కియారా అద్వానీలు స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. సో ఇక్కడ మిస్ అయినా ముంబైలో కియారా స్పెషల్ గా కనిపిస్తుందన్నమాట.