Advertisementt

బన్నీకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన కోర్టు

Fri 03rd Jan 2025 05:28 PM
allu arjun  బన్నీకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన కోర్టు
Nampally court granted regular bail to Bunny బన్నీకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన కోర్టు
Advertisement
Ads by CJ

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలు వరకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ కు నాలుగు వారాలకు గాను తెలంగాణ కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన అరెస్ట్ అయిన రోజే చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. 

రీసెంట్ గా ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరయ్యారు. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు ఈరోజు జరిగిన విచారణలో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. 50 వేల పూచికత్తు, రెండు షూరిటీలు సమర్పించాలని తెలిపిన కోర్టు..

అల్లు అర్జున్ తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీ భవించిన కోర్టు.. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో A-11గా ఉన్న అల్లు అర్జున్. 

హీరో అల్లు అర్జున్ పై పెట్టిన BNS 105 వర్తించదు అని, సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మృతికి అల్లు అర్జున్ కారణం కాదని వాదనలు వినిపించిన న్యాయవాదులు. ఇప్పటికే హై కోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు తెలిపిన న్యాయవాదులు..

ఇరు వాదనల అనంతరం.. అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశం. సో సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు కాస్త ఊరట లభించింది. 

Nampally court granted regular bail to Bunny:

Sandhya Stampede Case - Allu Arjun granted regular bail

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ