కమల్ హాసన్ తన మొదటి భార్య తో విడిపోయి నటి గౌతమి తో 13 ఏళ్లపాటు సహజీవనం చేసిన విషయం తెలిసిందే. 13 ఏళ్ళ పాటు కమల్-గౌతమి కలిసి ఉన్నారు, కానీ గౌతమి నాలుగేళ్ళ క్రితం కమల్ హాసన్ కి బ్రేక చెప్పేసి విడిపోయింది. అప్పటినుంచి తన కుమార్తె తోనే కలిసి ఉంటుంది. అయితే కమల్-గౌతమి ఎందుకు విడిపోయారో అనే విషయం పై రకరకాల ప్రచారాలు జరిగాయి.
తాజాగా గౌతమి తాను కమల్ తో ఎందుకు విడిపోయిందో అనేది బయటపెట్టింది. ఒక రిలేషన్ అంటే ఒక లైన్ పై ఇద్దరూ కలిసి నడవడం. కానీ ఆ లైన్ పార్లల్ గా కాకుండా రివర్స్ డైరెక్షన్లో ప్రయాణిస్తే.. ఆ రిలేషన్ లో ప్రేమ ఎలా ఉంటుంది, అలాంటి చిన్న చిన్న విషయాలు బంధాలు విడిపోవడానికి కారణాలు అవుతాయి. అది మోస్తూ భారంగా లైఫ్ ని కొనసాగించలేము కదా.. అందుకే నేను కమల్ కు బ్రేకప్ చెప్పాను అంటూ గౌతమి ఓ ఇంటర్వ్యూలో కమల్ తో బ్రేకపై రియాక్ట్ అయ్యారు.
అలా బంధాన్ని బ్రేక్ చేసుకోకపోతే.. తాను ముగ్గురికి అన్యాయం చేసిందానిని అవుతాను, అందులో ఒకటి తన కూతురు కూడా ఇలానే లైఫ్ లో ముందుకు వెళ్లాలని పరోక్షంగా చెప్పినట్లు ఉంటుంది, రెండవది తనని తాను మోసం చేసుకుంటున్నాననీ, తాను సంతోషంగా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాననీ, కానీ ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి బాధలను భరిస్తూ లైఫ్ లో ముందుకు వెళ్ళలేను అని, అంతేకాదు తన తల్లి నేర్పిన విలువలకు అర్థం రావాలంటే.. ఇలాంటి బాధలను భరించవలసిన అవసరం లేదని అందుకే కమల్ తో రిలేషన్ బ్రేక్ చేసుకున్నానని గౌతమి చెప్పుకొచ్చారు.