ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి ఎదురు లేదు, కానీ ఇప్పడు పాన్ ఇండియా స్టార్స్ తో చిరుకి పోటీ మాములుగా లేదు, తన ఏజ్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్ ల రూపం లో ఆయనకు గట్టి పోటీ ఎదురవుతూనే ఉంది. అయినప్పటికి మెగాస్టార్ తాను ఎంచుకునే స్క్రిప్ట్స్ అలాగే ఆయన పని చేసే డైరెక్టర్స్ అన్ని ఆయన చేసే సినిమాలపై క్రేజ్ పెంచుతున్నాయి.
ఇక పాన్ ఇండియా స్టార్స్ 100 కోట్లకు పైగా పారితోషికాలు అందుకుంటుంటే.. ఇప్పుడు మెగాస్టార్ చిరు కేవలం తెలుగు భాషకే 75 కోట్ల పారితోషికం అందుకుంటున్నారనే వార్త చూసి మెగాస్టార్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు అంటూ మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. వసిష్ఠ తో చేస్తున్న విశ్వంభరకు అటు ఇటూగా ఆయన 60 కోట్లు అందుకుంటున్నారట.
ఆ తర్వాత చిరు చెయ్యబోయే శ్రీకాంత్ ఓదెల చిత్రానికి మెగాస్టార్ రెమ్యునరేషన్ ఏకంగా 75 కోట్లు అనే వార్త వైరల్ గా మారింది. ఓదెల చిత్రానికి చిరు రెమ్యునరేషన్ తో రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరు శ్రీకాంత్ ఓదెల తో మూవీ మొదలు పెట్టేముందు ఆయన అనిల్ రావిపూడితో ఓ సినిమాకి కమిట్ అయ్యారనే వార్తలు ఉన్నాయి. మరి ఈ వార్తలు ఇంకా అధికారికంగా రాలేదు.