నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఈఏడాది కొత్త సినిమాతో సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్దమవుతున్నాడు. గత ఏడాది మోక్షజ్ఞ బర్త్ డే కి డెబ్యూ మూవీ కి సంబంధించి మోక్షు లుక్ నందమూరి అభిమానులను సర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ తో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఉండబోతుంది. అభిమానులు మోక్షజ్ఞ సెట్స్ మీదకి వెళ్లే క్షణం కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈమద్యలో ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మూవీ ఆగిపోయింది అని ప్రచారం జరుగుతుండగా.. మేకర్స్ ఈ కాంబో ఆగలేదు, త్వరలోనే పట్టాలెక్కుతోంది అంటూ హడావిడిగా ప్రెస్ నోట్ వదిలారు. అప్పటినుంచి మోక్షజ్ఞ ఊసు వినిపించడం లేదు. తాజాగా మోక్షజ్ఞ డాకు మహారాజ్ సెట్స్ లో కనిపించి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసాడు.
నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబోలో జనవరి 12 న విడుదలకు సిద్దమవుతున్న డాకు మహారాజ్ సెట్స్ లో నందమూరి వారసుడు మోక్షజ్ఞ కనిపించిన తీరుకు ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యారు. చిన్నపాటి గెడ్డంతో మోక్షజ్ఞ కొత్త లుక్ బాగా ఇంప్రెస్స్ చేసింది. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
మరి తండ్రి సినిమా సెట్స్ లో కనిపిస్తేనే ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్ ఆయన సినిమా పట్టాలెక్కితే ఇంకెంత సందడి చేస్తారో.