గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ కలయికలో రాబోతున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ నిన్న విడుదలైంది. గేమ్ ఛేంజర్ ట్రైలర్ లో రామ్ చరణ్ లుక్స్ మెగా అభిమానులకే కాదు, కామన్ ఆడియన్స్ ను కూడా ఇంప్రెస్స్ చేసాయి. చరణ్ ఫార్మర్ లుక్, ఫాదర్ లుక్, పోలీస్ లుక్, స్టూడెంట్ లుక్ ఇలా ప్రతి లుక్ లో రామ్ చరణ్ బాగా సెట్ అయ్యాడు.
అయితే గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూసి చాలామంది ఇది పుష్ప రేంజ్ మూవీ కాదు అంటూ పెదవి విరుస్తున్నారు, మరికొందరు ట్రైలర్ అస్సలు బాలేదు అంటూ నిర్మొహమాటంగా ట్వీట్లు చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వలేదు, శంకర్-చరణ్ పాస్ అవుతారు కానీ.. రికార్డులు క్రియేట్ చెయ్యలేరు అంటున్నారు.
విజువల్స్ సూపర్, థమన్ BGM నిజంగా అద్భుతం, కియారా లుక్స్ ఓకె, అంజలి బావుంది. గేమ్ ఛేంజర్ సాంగ్స్ కి పెట్టిన కాస్ట్ మొత్తం తెర మీద కనబడుతుంది కానీ.. విజువల్ గా, అలాగే మ్యూజిక్ పరంగా యావరేజ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. గేమ్ చెంజర్ ట్రైలర్ హరీబరిగా ఉంది, స్టోరీ లీకవ్వకుండా ట్రైలర్ కట్ ఉంది.. అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ట్రైలర్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. చరణ్ గెటప్స్ అన్ని ఎంతో బాగున్నాయి. జనవరి 10న థియేటర్స్ బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోవడం, చరణ్ బాబు పెద్ద సక్సెస్ అందుకోవడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్ ట్వీట్లు వేస్తుంటే ఇతర హీరోల ఫ్యాన్స్ ట్రైలర్ బాలేదు అంటూ కాస్త హార్ష్ గానే ట్వీట్లు వేస్తున్నారు.